సమస్యలకు తక్షణ పరిష్కారం : ఎస్‌పి

Jun 24,2024 21:42

ప్రజాశక్తి-విజయనగరం కోట  : జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్‌పి ఎం. దీపిక సోమవారం నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా 39 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

➡️