యువగళం సభను విజయవంతం చేయాలి

ప్రజాశక్తి – భోగాపురం: నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని మాజీ మంత్రి అమర్నాథ్‌ రెడ్డి అన్నారు. పోలిపల్లి సమీపంలో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో జన సమీకరణ పై సమీక్ష సమావేశం గురువారం నియోజకవర్గ ఇన్చార్జ్‌ కర్రోతు బంగార్రాజు, మండల పార్టీ అధ్యక్షులు సత్యన్నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు, మాజీ ఎంపిపి కంది చంద్రశేఖర్‌, ఇచ్చాపురం నియోజకవర్గం పరిశీలకులు సువ్వాడ రవిశేఖర్‌ తదితరులు మాట్లాడుతూ యువగళం ముగింపు సభతోనే ఎన్నికల శంఖారావం మొదలవుతుందన్నారు. అందుకు ప్రతి ఒక్కరు ఈ సభకు హాజరు కావాలని కోరారు. టిడిపి నాయకులు కడగల ఆనంద్‌ కుమార్‌, పల్లె భాస్కరరావు, లీలావతి, తమ్మి నాయుడు, మహతి శంకర్రావు , అప్పలనారాయణ పాల్గొన్నారు.బొబ్బిలి: టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం ముగింపు పాదయాత్రను జయప్రదం చేయాలని మాజీ మంత్రి అమర్నాథ్‌ రెడ్డి, విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ ఇంఛార్జి కిమిడి నాగార్జున, మాజీ ఎమ్మెల్యే తెంటు రాజా కోరారు. కోటలో గురువారం ముగింపు సభను జయప్రదం చేయాలని నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అరాచక పాలనకు వ్యతిరేకంగా టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల 20న నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లిలో ముగింపు సభ నిర్వహించను న్నట్లు చెప్పారు. ముగింపు సభకు టిడిపి కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి అల్లాడ భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.ఏర్పాట్లు పరిశీలననారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు సంబంధించిన భద్రత ఏర్పాట్లను, ట్రాఫిక్‌కు సంబంధించి పార్కింగ్‌ ఏరియాలను పోలీసులు గురువారం సాయంత్రం పరిశీలించారు. ఎఎస్‌పి ఆస్మా ఫర్హాన్‌, డిఎస్‌పి గోవిందరావు సభ స్థలంతో పాటు పార్కింగ్‌ ఏరియాలను పరిశీలించారు. సభా స్థలం వైపే వాహనాలకు పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. సభకు ఎదురుగా హైవేలో శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం రూట్‌ లో పార్కింగ్‌ ఏర్పాటు చేస్తే రోడ్‌ క్రాస్‌ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందని నాయకులకు సూచించారు. సిఐ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️