రక్తదానం ప్రాణదానంతో సమానం

 ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా):రక్తదానం ప్రాణదానంతో సమానమని జనసేన పార్టీ నర్సాపురం నియోజకవర్గ ఇన్చార్జ్‌ బొమ్మిడి నాయకర్‌ అన్నారు. మార్చి 27న గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆదివారం మండలంలోని చిట్టవరం గ్రామంలో స్థానిక అంజనాపుత్ర చిరంజీవి పవన్‌ కళ్యాణ్‌ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్త దాన శిబిరంలో హోప్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పాలకొల్లుకు చెందిన ఆపద్బంధు బ్లడ్‌ బ్యాంకు వారు 32 మంది అభిమానుల నుండి రక్తాన్ని సేకరించారు. చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ హైదరాబాద్‌ వారు పంపిన సర్టిఫికెట్లను రక్తదాతలకు అందజేశారు. అనంతరం రామ్‌ చరణ్‌ పుట్టినరోజు కేక ను కట్‌ చేసి అభిమానులకు పంచారు. ఈ కార్యక్రమంలో అభిమానులు కోపల్లి శ్రీనివాస్‌, చల్లా హేమ, శానం రామకష్ణ, గ్రంధి శ్రీను, పోలిశెట్టి సత్తిబాబు, గుగ్గిలపు శివరామకష్ణ, పైడికొండల కష్ణ, కర్రా శ్రీను, పోలిశెట్టి బాబి, కొప్పిరెడ్డి హరిబాబు, మద్దుల శ్రీనివాస్‌, నిప్పులేటి రామారావు, గుబ్బల మర్రాజు, కూనపురెడ్డి రామకృష్ణ, దూసనపుడి కోటి తదితరులు పాల్గొన్నారు.

➡️