రత్నం విద్యాసంస్థల అధినేత రత్నం కన్నుమూత

ప్రజాశక్తి-నెల్లూరు : విద్యా వ్యవస్థలో నెల్లూరు కీర్తిని దేశవ్యాప్తంగా చాటిన స్నేహశీలి, మానవతావాది, నిగర్వి ,విద్యా ప్రదాత కె.వి రత్నం కొద్దిసేపటికి కిందట కన్నుమూశారు. ముత్తుకూరు రోడ్‌లోని అపోలో ఆసుపత్రి సమీపంలోని వారి గెస్ట్‌హౌస్‌ వద్ద భౌతికకాయాన్ని సందర్మనకు ఉంచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రత్నం మృతి జిల్లాకు తీరని లోటును పలువురన్నారు ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచితంగా చదువులు చెప్పిన గొప్ప వ్యక్తిని కొనియాడారు. ప్రముఖ విద్యావేత్త రత్నం శిష్యరికంలో ఉన్నత విద్యలను అభ్యసించి వేలమంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత శిఖరాల్లో ఉన్నారన్నారు. రత్నం అనే పేరుకు తగ్గట్టుగానే చిన్నతనం నుంచి కష్టపడి చదివి ఉన్నత శిఖరాల అధిరోహించి.. అత్యున్నత విలువలతో జీవన సమరం సాగించాడని కొనియాడారు.

➡️