రమణయ్యకు సన్మానం

ప్రజాశక్తి-సిఎస్‌.పురం : అంకితభావంతో పనిచేసి విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల్లో మూడి రమణయ్య అగ్రణ స్థానంలో ఉంటారని సిఎస్‌.పురం ఎంఇఒ జె.ప్రసాదరావు పేర్కొన్నారు. కొందబోయి నపల్లి ప్రధానోపాధ్యాయుడు ముడి రమణయ్య ఉద్యోగ విరమణ సన్మాన సభ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎ.వెంకట నదియా అధ్యక్షతన పి.మాలకొండయ్య ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఇఒ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ సహజమని తెలిపారు. ఎంఇ-2 రాజాల కొండారెడ్డి మాట్లాడుతూ ముడి రమణయ్య రెండు జిల్లాలలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందారన్నారు. ఉపాధ్యాయ జీవితంలో మూడి రమణయ్య నిబద్ధతతో పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని తెలిపారు. అనంతరం రమణయ్యను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎపిటిఎఫ్‌ మండల అధ్యక్షులు తోట శ్రీనివాసులు, ఉప్పలపాడు గ్రామ సర్పంచి ప్రవీణ్‌కుమార్‌, బోయమడుగుల ఎంపిటిసి బైరెడ్డి తిరుపతిరెడ్డి, సర్పంచి బొట్ల చిరంజీవి, నాయకులు చప్పిడి సుబ్బయ్య, మిరియం వెంకటేశ్వర్లు, భువనగిరి వెంకటయ్య, పి. వెంకటేశ్వరరెడ్డి, పాములపాటి నరసయ్య, హుస్సేన్‌రెడ్డి, మితేకాల గురవయ్య, అంబాల చిన్న వెంకటరెడ్డి, మురార్జీ, లాయర్‌ శ్రీనివాసులు, ఉపాధ్యాయులు షేక్‌ నాయబ్‌రసూల్‌, పి.రాజ్‌కుమార్‌, కమ్మనేతి వెంకటేశ్వర్లు, జెఎస్‌.ఆనంద్‌బాబు, జి.రామకష్ణ, కె.చెన్నయ్య, బత్తుల రవీంద్ర, సతీష్‌, ఏలికా శ్రీనివాసులు, చంద్రశేఖర్‌, ఇర్లకొండయ్య, పఠాన్‌ నాయబ్‌రసూల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️