‘రాజకీయ లబ్ధి కోసమే కన్నా ఆరోపణలు’

సత్తెనపల్లి టౌన్‌:  కేవలం రాజకీయ లబ్ది పొందెందుకే టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ తనపై అసత్య ఆరోపణలు చేయటం విడ్డురంగా ఉందని రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన స్థానిక ప్రభుత్వం ఆసుపత్రిలో టిడిపి, వైసిపీ పరస్పరం రాళ్లు రవ్వుకున్న ఘటనలో గాయాలపాలై చికిత్స పొందుతున్న వైసిపీ క్షత గాత్రులను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముప్పాళ్ళ మండలం తొండపిలో కన్నాపై దాడి కాదని టీడీపీ, వైసిపీ పరస్పరం రాళ్లురవ్వుకున్నారని అన్నారు. తన నేతృత్వంలో ఈ దాడి జరిగిందని, తాను తృటిలో దాడి నుండి తప్పించుకున్నానని కన్నా మాటా ్లడటం బాధకారమన్నారు. కేవలం రాజకీయంగా కన్నా తనపై బురద చాల్లే ప్రయత్నంలో భాగంగానే ఈ ఆరోపణలు చేశారన్నారు. తొండపి సమస్యత్మాక గ్రామం అని, గత ఎన్నికల్లో తాను, ప్రస్తుతం రాజీనామా చేసిన ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయులు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు కూడా ఇదే రకమైన ఘటన జరిగిన విషయం కన్నాకు తెలియదేమో అని ఎద్దేవా చేశారు. ఇలాంటి గ్రామాలకు వెళ్ళేటప్పుడు పోలీసుల అనుమతి తీసుకోవాలని, టీడీపీ నాయకులు కనీసం పోలీసులకు సమాచారమే ఇవ్వలేదని అన్నారు. అయినప్పటికీ సకాలంలో పోలీసులు ఘటన స్టలికి చేరుకోవడంతో పరిస్థితిని అదుపులోకి వచ్చిందని అన్నారు. రాజకీయంగా ఇలాంటి ఘటనలను ఖండిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. తాను ఎప్పుడూ ఘర్షణలను ప్రోత్సహించలేదని, అలాంటి తనపై టీడీపీ పసలేని ఆరోపణలు చేసి, ఈ ఘర్షణలకు రాజకీయ రంగుపులిమి ప్రజలు మన్ననలు పొందాలనుకోవటం వారి అవివేక మన్నారు. క్షతగాత్రులు ఎవరూ భయపడవద్దని అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు.

➡️