‘రా కదలి రా’ బహిరంగ సభ విజయవంతానికి పిలుపు

మాట్లాడుతున్న టిడిపి మండల అధ్యక్షుడు గోపాలస్వామి

ప్రజాశక్తి – ఆలమూరు

మండపేటలో ఈనెల 20న జరిగే టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యే ”రా కదలిరా” బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు మెర్ల గోపాల స్వామి పిలుపునిచ్చారు. మంగళవారం చొప్పెల్లలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక నగరమైన మండపేటలో జరిగే ‘రా కదిలిరా’ సభకు టిడిపి, జనసేన పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరుకావాలన్నారు.కార్యక్రమంలో సుఖమల్ల రాముడు, మద్ది పట్టాభి, తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

 

 

➡️