రూ.1.15 లక్షల గోవా మద్యం పట్టివేత

Feb 2,2024 23:05

ప్రజాశక్తి – వినుకొండ : అక్రమ గోవా మద్యాన్ని సెబ్‌ అధికారులు ఛేదించి పట్టుకున్నారు. పల్నాడు జిల్లా సేబ్‌ సూపరిండెంట్‌ కాజా మొహిద్దిన్‌ తెలిపిన వివరాల మేరకు వినుకొండ మండలం చీకటిగలపాలెం గ్రామం వద్ద ప్రియాంక డాబా హోటల్‌లో వల్లెం శ్రీనివాసరావు అనే వ్యక్తి గోవా మద్యాన్ని అక్రమంగా దిగుమతి చేసి విక్రయిస్తు న్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించి గోవా అక్రమ మద్యాన్ని పటుకున్నారన్నారు. ఎస్సై నగేష్‌, కానిస్టేబుళ్లు రవి,రత్తయ్యలు గోవా అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచి పక్క సమాచారంతో శుక్రవారం హోటల్‌ పై దాడులు చేసి 15 కేసులు, అదనంగా 43 ఫుల్‌ బాటిల్స్‌ పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడు వల్లెం శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నామని, గోవా మద్యంతోపాటు మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్లు చెపాపరు. నిందితుడు శ్రీనివాసరావుని విచారించగా గోవాకు చెందిన నితిన్‌ బాలకృష్ణ నిక్‌ వాడే వద్దనుండి ఈ మద్యం కొనుగోలు చేసినట్లు చెప్పాడని, ఇద్దరిపై కేసు నమోదు చేసి వల్లెం శ్రీనివాసులు అరెస్ట్‌ చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం ధర రూ.1.15 లక్షలు ఉంటుందని తెలిపారు.

➡️