రూ.50వేలు దాతృత్వం

Feb 24,2024 21:34
ఫొటో : ఆర్థికసాయం అందజేస్తున్న కంచి పరమేశ్వర్‌రెడ్డి

ఫొటో : ఆర్థికసాయం అందజేస్తున్న కంచి పరమేశ్వర్‌రెడ్డి
రూ.50వేలు దాతృత్వం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : నిత్యాన్నదాత శ్రీ సాంబశివ చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత కంచి పరమేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో ఇటీవల కాలంలో మృతి చెందిన ఐదుగురి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.10వేలు వంతున మొత్తం రూ.50 వేలు దాతృత్వం చేశారు. రెండవ వార్డు పరిధిలోని వెంకట్రావుపల్లి గ్రామంలోని ముస్లీం వీధిలో ఇటీవల మృతి చెందిన ఖాదరమ్మ కుటుంబ సభ్యులను నిత్య అన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి పరామర్శించారు. ఆ కుటుంబానికి రూ.10వేలు ఆర్థికసాయం అందజేశారు. 22 వార్డు పరిధిలోని జ్యోతి నగర్‌లో వెంకటరత్నం మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించిన పరమేశ్వర్‌రెడ్డి రూ.10వేలు ఆర్థికసాయం అందజేశారు. 6వ వార్డ్‌ పరిధిలోని జెఆర్‌పేటలో ఇటీవల మృతి చెందిన ఖాజాపీర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆ కుటుంబానికి రూ.10వేలు ఆర్థికసాయం అందజేశారు. 15వ వార్డు పరిధిలోని అల్తాఫ్‌ ఇటీవల మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని నిత్య అన్నదాత కంచిపరమేశ్వరరెడ్డి పరామర్శించారు. ఆ కుటుంబానికి రూ.10వేలు ఆర్థికసాయం అందజేశారు. 16వ వార్డు పరిధిలో ఇటీవల మృతి చెందిన మునీర్‌ భాషా ఇటీవల మృతి చెంది ఉండడంతో ఆ కుటుంబాన్ని కంచి పరమేశ్వర్‌ రెడ్డి పరామర్శించి, రూ.10వేలు ఆర్థికసాయం అందజేశారు. వార్డు కౌన్సిలర్‌ శివకోటరెడ్డి, మహబూబ్‌ బాషా, వార్డు ఇన్‌ఛార్జి రహీం, ఉపాధ్యాయుడు మురళి, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర్‌ రెడ్డి చేస్తున్న సేవగుణాన్ని కొనియాడారు. కార్యక్రమంలో మెప్మా టిఎల్‌ఎఫ్‌ ఉపాధ్యక్షురాలు ప్రమీల, మెప్మా ఆర్‌పిలు సుజాత, శిరీష, ఆఫ్రీన్‌, ట్రస్ట్‌ సభ్యులు రాంపల్లి ప్రసాద్‌ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

➡️