రూ. 7405.51 కోట్లతో పిఎల్‌పి

Feb 7,2024 20:32

ప్రజాశక్తి-విజయనగరం : జాతీయ వ్యవసాయ, గ్రామీణ భివృద్ధి బ్యాంకు(నాబార్డ్‌) 2024-25 ఆర్ధిక సంవత్సరానికి రూపొందించిన జిల్లా పొటెన్షి యల్‌ లింక్డ్‌ క్రెడిట్‌ ప్లాన్‌ ను రూ. 7405.51 కోట్లతో కలెక్టర్‌ నాగలక్ష్మి ఆమోదం తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలను, జాతీయ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని వివిధ శాఖల సమన్వయంతో రూపొందించిన పిఎల్‌పి ని కలెక్టరేట్‌ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన డిసిసి సమావేశంలో కలెక్టర్‌ ఆవిష్కరించారు. జిల్లాకు సంబంధించి, ప్రాధా న్యతా విభాగంలో 2024-25 ఆర్ధిక సంవత్సరం లో క్రెడిట్‌ పొటెన్షియల్‌ కింద వ్యవసాయ ఇతర రంగాలకు అంచనా వేశామన్నారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పంట ఉత్పత్తి, నిర్వహణ, మార్కెటింగ్‌కు రూ.3929.13 కోట్లు, వ్యవ సాయం, అనుబంధ కార్యకలాపాల కోసం టర్మ్‌లోన్‌ 675.32 కోట్లు, వ్యవసాయం మౌలిక సదుపాయాలకు రూ.83.29 కోట్ల రూపాయ లను అంచనా వేశారు. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు 41.25 కోట్లు, క్రెడిట్‌ పొటెన్షియల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ కు 4728.99 కోట్లు, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు 899.60 కోట్ల, ఎగుమతి క్రెడిట్‌ 4.48 కోట్ల కు అంచనాలు వేశారు. విద్య కు రూ. 47.79కోట్లు, హౌసింగ్‌కు 502.04 కోట్లు, బ్యాంక్‌ క్రెడిట్‌తో కూడిన సామాజిక మౌలిక సదుపాయాలు 8.35 కోట్లు, డ్వాక్రా సంఘాలు, అసంఘటిత రంగం 1210.00 కోట్లు మొత్తం ప్రాధాన్యత రంగానికి రూ. 7405.52 కోట్లు కేటాయించారు. జగనన్న తోడు 9వ విడత నిధులకు డిసిసిలో ఆమోదం తెలిపారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్‌ కె.కార్తీక్‌ మాట్లాడుతూ కౌలు రైతులకు శతశాతం రుణాలు అందజేయాలని బ్యాంకర్లకు కోరారు. కార్యక్రమంలో నాబార్డ్‌ డిడిఎం టి.నాగార్జున, సహాయ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, ఎల్‌డిఎం శ్రీనివాస రావు, పలు బ్యాంకు లకు చెందిన అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️