రేపటి రైతు ట్రాక్టర్ల ర్యాలీని జయప్రదం చేయండి

పల్నాడు జిల్లా: కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ట్రాక్టర్‌, బైకు ర్యాలీలో భాగంగా ఈ నెల 26వ తేదీన పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో వ్యవసాయ మార్కెట్‌ యార్డు నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు ఆ ర్యాలీలు నిర్వ హించనున్నారు. రైతు, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం సన్నా హక సమా వేశం జరిగింది. నరసరావ ుపేట లోని కోటప్ప కొండ రోడ్డులోని రైతు సంఘ కార్యాలయంలో ఈ మేరకు తీర్మా నించారు. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు పరచకుండా మోసగిస్తుందని, వ్యవసాయ, పారిశ్రామిక, రవాణా, ఖనిజ, సకల సంపదలను అంబానీ, ఆదాని తదితర కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతోందని విమర్శించారు. అడ్డుగా ఉన్న చట్టాలను అడ్డగోలుగా మారుస్తూ, ప్రశ్నించిన వారి పైన కేసులు వేధింపులు సాగిస్తుందని, ప్రజాతంత్ర హక్కులను, రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ, రాజ్యాంగ ఉల్లం ఘనకు పాల్పడుతోదని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాలలో సుమారు 1,50,000 మంది రైతులు బలవన్మరణానికి పాల్ప డ్డారని, బిజెపి రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత శాతం ఆత్మహత్యలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.స్వామినాథన్‌ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరల చట్టం చేయాలని, రైతు రుణ ఉపశమన చట్టం చేయాలని, నాలుగు లేబర్‌ కోడ్‌ లను రద్దు చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు పరచాలని, వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్‌ మీటర్ల బిగింపును ఆపాలని, ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని, తదితర డిమాండ్ల సాధన కోసం జరిగే ఈ ర్యాలీ జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుంటుపల్లి బాలకష్ణ, ఏపూరి గోపాలరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు, ఏఐటీ యూసీ పల్నాడుజిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు, సిఐటియు జిల్లా ఉపా ధ్యక్షులు జి. విజయకుమార్‌, కోశాధికారి డి. శివకుమారి, వ్యవసాయ కార్మిక సం ఘం జిల్లా కార్యదర్శి ఏ. లక్ష్మీశ్వర్‌ రెడ్డి ,ఆల్‌ ఇండియా కిసాన్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు రెడ్‌ బాషా, కేఎన్పీఎస్‌ నాయకులు కృష్ణ, ప్రగతి శీల కార్మిక సమాఖ్య కంబాలకొండలు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కోట సాయి, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయరాజు, పిడిఎం నాయకులు రామకృష్ణ, మస్తాన్వలి, నరసరావుపేట మండల రైతు సంఘ కార్యదర్శి బండారుపల్లి నాగేశ్వరావు పెన్షన ర్ల నాయకులు సుభాష్‌ చంద్రబోస్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️