రేషన్‌ ఇప్పించండిజిసిసి కార్యాలయం ఎదుట గిరిజనుల ధర్నా

Feb 26,2024 21:48

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : డిసెంబర్‌, జనవరి నెలల రేషన్‌ బియ్యం వెంటనే ఇప్పించాలని గుమ్మ డిఆర్‌ డిపో పరిధిలో గల ఏగులవాడ గ్రామ గిరిజనులు సోమవారం స్థానిక జిసిసి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ సేల్స్‌ మాన్‌ డిసెంబర్‌, జనవరి నెలల రేషన్‌ సరుకుల బిల్లులు ఇచ్చినా నేటికీ బియ్యం పంపిణీ చేయలేదని తెలిపారు. ఇదే విషయమై సేల్స్‌మాన్‌ను నిలదీయగా బియ్యం లేవని, బియ్యానికి తగిన డబ్బులు ఇస్తానని అంటున్నాడని తెలిపారు. తమకు డబ్బులు వద్దు బియ్యం కావాలంటూ పట్టుబట్టారు. అసలే పేద గిరిజనులం ప్రభుత్వం ఇచ్చిన బియ్యంతోనే జీవం సాగిస్తున్నామన్నారు. విషయం ఏమిటంటే బియ్యం తూకం వేశాకే ఆ బరువు తగ్గ బిల్లు కూడా ఇవ్వాలి. గిరిజనుల అమాయకత్వం చూసుకొని బియ్యం తూకం వేసి బిల్లు మాత్రమే ఇచ్చారు. ప్రజలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకున్నారని విషయం స్పష్టమవుతుంది. తమ సమస్యను మేనేజర్‌ కృష్ణప్రసాద్‌కు వివరించారు. చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

➡️