రైతులకు పరిహార మందించాలి: సిపిఎం

ప్రజాశక్తి- శృంగవరపుకోట : తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారాన్ని అందించాలని సిపిఎం రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మద్దిల రమణ డిమాండ్‌ చేశారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం మండలంలోని కొత్తూరు, తిమిడి, వసి గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను సిపిఎం పార్టీ ఎస్‌కోట డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన రైతులందరికీ ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు. తడిచిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోకపోతే సిపిఎం పార్టీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో రైతన్నలను ఐక్యం చేసి పెద్దఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గాడి అప్పారావు, సిపిఎం పార్టీ కమిటీ సభ్యులు పివి రమణ, రైతులు ఆవాల రాంబాబు, గంగిరెడ్ల గోవింద, చుక్కా సత్యనారాయణ, నెలివాడ రాము, వాడబోయిన అప్పారావు, వేచలపు దేవుడు, పైడిరాజు, బత్తిన రమణ, రాములమ్మ రమణ, సన్యాసి, సింహాద్రి, ఎర్ర మహేషేశ్వర రావు, దేముడు, గురువులు, గుమ్మడి గురువులు, కృష్ణ, బోని అప్పారావు, సత్తిబాబు, చుక్కా మంగమ్మ, రాము, సత్యం తదితరులు పాల్గొన్నారు.

➡️