రైతుల సేవలు వెలకట్టలేనివి

మిర్చి యార్డును పరిశీలించిన అంబటి రాయుడు

గుంటూరు జిల్లా ప్రతినిధి: దేశాభివృద్ధిలో రైతుల సేవలు వెలకట్టలేనవి అని ప్రముఖ క్రికెటర్‌ అంబటి రాయుడు అన్నారు. బుధవారం ఆయన మిర్చి యార్డ్‌ చైర్మన్‌ నిమ్మకాయల రాజనారాయణతో కలిసి యార్డులో పర్యటించారు. హమాలీలు, రైతులు, ఎగుమతి, దిగుమతి వర్తక, వ్యాపారస్తులు, మార్కెట్‌ కమిటీ సభ్యులు ఇతర బాధ్యులతో ఆయన చర్చించారు. రైతులకు మార్కెట్‌ కమిటీ అందిస్తున్న సేవల పట్ల ఆయన సంతప్తి వ్యక్తం చేశారు. అంబటి మాట్లాడుతూ రైతుల కోసం ప్రభు త్వాలు చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. మిర్చి యార్డ్‌ చైర్మన్‌ నిమ్మకాయల రాజనారాయణ మాట్లా డుతూ క్రికెట్‌ లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన అంబటి రాయుడు మన జిల్లా వాసే కావటం గర్వ కారణం అన్నారు. రాజకీయాలకతీతంగా ఆయన రైతులు ఇతర వర్గాలతో మమేకమై ప్రజల సాధక, బాధలు తెలుసుకుంటున్నారని వివరించారు. యార్డు లో పర్యటించి రైతులు, వ్యాపారస్తులు, ముఠా కార్మికులను కలిసి మిర్చి పంటకు సంబంధించి దిగుబడులు,వ్యయాలు, నాణ్యత, పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసో సియేషన్‌ నాయకులు అప్పిరెడ్డి, నారాయణరావు, సాంబిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ సుభానీ, పాలకవర్గ సభ్యులు ఇంద్ర,శ్రీనివాసరావు, సాంబిరెడ్డి,సతీష్‌, సీతారామ్‌ దాస్‌, ఖాజా మొహిద్దీన్‌, నాగేశ్వరరావు, నరేంద్ర పాల్గొన్నారు.

➡️