రైసుమిల్లులపై దాడులు

Jan 5,2024 21:02

ప్రజాశక్తి-రేగిడి :  మండలంలోని కొండలమామిడివలస, అంబకండి, పారంపేట, కోడిస గ్రామాల్లో ఉన్న రైసుమిల్లులపై అధికార యంత్రాంగం గురు, శుక్రవారాల్లో దాడులు చేపట్టింది. ఈ నెల 4న ‘ధాన్యం రైతులు గగ్గోలు’ అనే కథనం ప్రజాశక్తిలో ప్రచురించడంతో జిల్లా యంత్రాంగంలో ప్రకంపనలు పుట్టించింది. కలెక్టర్‌ నాగలక్ష్మి, డిఎస్‌ఒ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఎడి కె. చందర్రావు, తహశీల్దార్‌ సుదర్శన్‌రావు, ఎఒ గిరడ మురళీకృష్ణ రైస్‌మిల్లులపై దాడులు చేశారు. అక్కడ ఉన్న కొంతమంది రైతులతో అధికారులు మాట్లాడి, వివరాలు సేకరించారు. కొంతమంది రైతులతో మాట్లాడితే దోపిడీ నిజమేనని చెప్పారు. ప్రభుత్వ నిబంధన మేరకు 80 కేజీలు మాత్రమే తీసుకోవాలని, అదనంగా తీసుకుంటే రైస్‌మిల్లులను సీజ్‌ చేస్తామని అధికారులు హెచ్చరించారు.

➡️