రోగికి మెరుగైన వైద్యానికి కృషి

శరగడం పత్నిరావు

ప్రజాశక్తి-ములగాడ: ఇఎస్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎం రామిరెడ్డి అనే వ్యక్తికి కెజిహెచ్‌కు పంపి మెరుగైన వైద్యసేవలు అందేలా కృషి చేయడంతోపాటు, ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి, ఆరోగ్యంపై ఆరా తీసిన వైసిప నగర కార్యదర్శి శరగడం పత్నిరావు చొరవపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నారు. ఈనెల 21న జగన్‌ జన్మదినం సందర్భంగా ఇఎస్‌ఐ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీకి వెళ్లిన పత్నిరావు, అక్కడ రామిరెడ్డికి మెరుగైన వైద్యం ఆవశ్యకతపై అతని కుటుంబీకులు పత్నిరావు దృష్టికి తేగా, ఆయన ఇఎస్‌ఐ ఆసుప్రతి, కెజిహెచ్‌ వైద్యులతో మాట్లాడి, కేజిహెచ్‌లో జాయిన్‌ చేయించారు. మెరుగైన వైద్యం కోసం కెజిహెచ్‌సూపరెంటిండెంట్‌కు విన్నవించారు. శనివారం కెజిహెచ్‌కు వెళ్లి రామిరెడ్డిని పరామర్శించారు. ఒక రోగి వైద్యం పట్ల పత్నిరావు చొరవను పలువురు అభినందిస్తున్నారు.

కెజిహెచ్‌లో రామిరెడ్డిని పరామర్శిస్తున్న పత్నిరావు

➡️