లోకేష్‌ పాదయాత్రకు అపూర్వ ఆదరణ

Dec 23,2023 21:51
ఫొటో : మాట్లాడుతున్న మాజీ జెడ్‌పి చైర్మన్‌ చెంచలబాబు యాదవ్‌

ఫొటో : మాట్లాడుతున్న మాజీ జెడ్‌పి చైర్మన్‌ చెంచలబాబు యాదవ్‌
లోకేష్‌ పాదయాత్రకు అపూర్వ ఆదరణ
ప్రజాశక్తి-ఉదయగిరి : కుప్పం నుంచి విశాఖపట్నం వరకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ముగింపునకు ప్రజల అపూర్వ ఆదరణ దీవెనలు వెల్లువత్తాయని టిడిపి ఆర్గనైజిక్‌ సెక్రెటరీ, మాజీ జెడ్‌పి చైర్మన్‌ చెంచలబాబు యాదవ్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం జిల్లా పోలిపల్లిలో లోకేష్‌ పాదయాత్రకు కుప్పం నుంచి విశాఖపట్నం వరకు ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించిన విజయవంతంగా సాగిందని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌ కలయికతో రాష్ట్రంలో 160 స్థానాలలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ బహిరంగ సభకు 5లక్షల మంది ప్రజలు హాజరు కావడం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకతకు నిదర్శనం రాష్ట్రంలో రాబోయేది టిడిపి, జనసేన ప్రభంజనమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

➡️