వంద శాతం పల్స్‌ పోలియో చుక్కలు వేయాలి

పల్నాడు జిల్లా: వచ్చే నెల 3న జరగనున్న పల్స్‌ పోలియో కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐదేళ్ల లోపు చిన్నారులు 1.86 లక్షల మందికి వంద శాతం పల్స్‌ పోలియో చుక్కలు వేయాలని జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివ శంకర్‌ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా నరసరావు పేట్‌లోని కలెక్టరేట్‌లో పల్స్‌ పోలియో ప్రక్రియకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ప్రచు రించిన వాల్‌పోస్టర్లను బుధవారం కలెక్టర్‌ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్‌ ఛాంబర్‌లో మార్చి 3 న జరగ నున్న పల్స్‌ పోలియో పై జిల్లా అధి కారు లతో సమీక్ష సమావేశం వెబెక్స్‌ ద్వారా నిర్వహించారు. పోలియో కేంద్రా లలో వేయ డంతో పాటు 4, 5 తేదీలలో ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయా లని ఆదేశించారు. జిల్లాలోని పంచాయతీరాజ్‌, పోలీస్‌ శాఖ, ఐసీడీఎస్‌, విద్యాశాఖ, మున్సిపల్‌ శాఖ, ఆర్టీసీ ,రైల్వే శాఖ ,పబ్లిక్‌ రిలేషన్స్‌ శాఖ అధికారులు సహాయ సహకారాలు అందించాలన్నారు. జిల్లాలో మొత్తం 1135 పోలియో కేంద్రాలు,70 సంచార పోలియో టీం ద్వారా జరిగే పల్స్‌ పోలియో కార్య కమాన్ని విజయ వంతంగా పూర్తి చేయా లని ఆరోగ్య కార్య కర్తలు, అంగన్వాడీ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొనాలని ఆదేశించారు. సమీక్ష సమా వేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి.రవి, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధి కారి డాక్టర్‌ బి గీతాంజలి,జిల్లా మలేరియా అధికారి రవీంద్ర రత్నాకర్‌, డిసిహెచ్‌ రంగారావు తదితరులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి జిల్లాలో పేదల ఇళ్ల పట్టాలకు సం బంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇప్పటి వరకు 74.6 శాతం పూర్తి చేశారని, మిగి లిన దానిని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ శివ శంకర్‌ ఆదేశించారు. బుధవారం ఆయు ష్మాన్‌ భారత్‌, ఆరోగ్యశ్రీ కార్డులు ,భూ రీ -సర్వే తదితర అంశాలపై సంబంధిత అది óకారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పేదలు అందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా 87,169 రిజిస్ట్రేషన్‌ లక్ష్యం కాగా 65, 014 రిజి స్ట్రేషన్లు పూర్తయినట్లు చెప్పారు. రిజి స్టేషన్‌ ప్రక్రియలో వెనుకబడిన మండ లాలు త్వరితగతిన రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయుష్మాన్‌ భారత్‌ ఈకేవైసీ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు మొత్తం 9, 90,997 లక్ష్యం కాగా 6,69,210 ఈకేవైసి చేయడం జరిగిం దని మిగిలిన వాటిని త్వరిత గతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా భూముల రీ-సర్వే కార్యక్రమంలో లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

➡️