వచ్చే ఎన్నికల్లో విశ్వాసంతో పని చేయండి: చంద్రబాబు

ప్రజాశక్తి-పిసిపల్లి: వచ్చే ఎన్నికల్లో విశ్వాసంతో పని చేయండి. భవిష్యత్తు మనదే అని బెంగుళూరులోని టిడిపి ఫోరం కనిగిరి నియోజకవర్గ సభ్యులకు చంద్రబాబునాయుడు సూచించారు. గురువారం బెంగుళూరులో టిడిపి ఫోరం సభ్యులు నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలోని టిడిపి మద్దతుదారులు సుమారు నాలుగువేల మందికిపైగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరినీ తమ తమ ప్రాంతానికి వచ్చి ఎన్నికల్లో పాల్గొనేలా చైతన్యం తేవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యేగా ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని గెలిపించేందుకు అందరూ కృషి చేయాలని కోరినట్లు ఫోరం సభ్యులు తెలిపారు. చంద్రబాబు నాయుడిని కలిసినవారిలో డి శివ, ప్రవీణ్‌, శ్రీనివాసులు, హరికృష్ణ, మురళి, మాధవ, వెంకటరత్నం, వేణుగోపాల్‌, సుభాష్‌ శ్రీను, తిరుపాలు, మధు, శేఖర్‌, నర్సింహులు, వెంకటేశ్వర్లు, మనోహర్‌, శ్రీను, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️