వాకర్స్‌తో ఎమ్మెల్యే వెలగపూడి భేటి

వాకర్స్‌తో ఎమ్మెల్యే వెలగపూడి భేటి

ప్రజాశక్తి – ఆరిలోవ : తూర్పు నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీచేయనున్న ప్రస్తుత ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు బుధవారం ఉదయం 13వ వార్డు ముడసర్లోవ వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు శాలువతో సత్కరించారు. వాకర్స్‌కు వాలీబాల్‌ గ్రౌండ్‌, ఓపెన్‌ జిమ్‌ను ఏర్పాటు చేసిన వెలగపూడికి అసోసియేషన్‌ అధ్యక్షుడు మూర్తి, సెక్రటరీ ఈశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ ఆరిలోవ హెల్త్‌సిటీలో 2.84 ఎకరాల స్థలాన్ని ఇండోర్‌ స్టేడియానికి కేటాయించామని,తమ ప్రభుత్వం రాగానే ఇండోర్‌ స్టేడియం నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. టిడిపి నాయకులు ఒమ్మి అప్పలరాజు, బుడుమూరు గోవిందు, గాడి సత్యం, ఒమ్మి పోలారావు, ముగడ రాజారావు, రాగతి అచ్యుతరావు, బాసస్వామి ఉన్నారు.

. ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబును సన్మానిస్తున్న వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు

➡️