వాటర్‌ ప్లాంట్‌లపై తనిఖీలకు సిఫార్సు

ప్రజాశక్తి వార్తకు స్పందన

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి  : గుంటూరులో మినరల్‌వాటర్‌ ముసుగులో నిర్వహిస్తున్న వాటర్‌ప్లాంట్‌లను తనిఖీ చేసి నీటి నాణ్యత పరీక్షలుచేయాలని ఆహార నియంత్రణ శాఖ అధికారులకు లేఖ రాశామని మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు, కమిషనర్‌ చేకూరి కీర్తి శనివారం మీడియాకు తెలిపారు. వాటర్‌ ప్లాంట్‌ ల ద్వారా సరఫరా చేస్తున్న నీటిలో కూడా బ్యాక్టీరియాఉందని ఇటీవల పరీక్షాకేంద్రాల్లో తేటతెల్లమయిందని శనివారం ప్రజాశక్తిలోవచ్చిన వార్తకు వారుస్పందించారు. కొన్ని వాటర్‌ప్లాంట్‌ నిర్వహణ సరిగాలేదని, నీటిలో బ్యాక్టిరీయా ఉందని నిర్ధారణ అయిందని తెలిపారు. వీటిపై తనిఖీ చేసేఅధికారం ఆహార నియంత్రణ శాఖదేనన్నారు. డయేరియా ప్రభలిన ప్రాంతాల్లో అన్ని విభాగాల అధికారులు, సిబ్బందితో పాత త్రాగు నీటి పైపు లను మార్చడం, స్కవర్‌ పిట్‌ లను ఏర్పాటు చేయడం, కాలువలకు సమాంతరంగా ట్యాపులను మార్పిడి చేశామన్నారు. గుంటూరు నగరానికి త్రాగు నీరు అందే ప్రకాశం బ్యారేజిలో పులిచింతల నుండి వచ్చే నీటిలో టర్బిడిటి ఉంటుందని, జనవరి 27 న పత్రికాముఖంగా తెలిపి ప్రజలు కొన్ని రోజులు కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని తెలిపామన్నారు. అయినప్పటికీ అప్పటినుండి వచ్చిన నీటిని ఎప్పటికప్పుడు హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రీజినల్‌ ల్యాబ్‌ నందు పరీక్షలు నిర్వహించిన పిదపనె శుద్ధ నీటిని సరఫరా చేయుట జరుగుతునన్నారు. అంతేకాక ప్రతి రిజర్వాయర్‌ క్లోరిన్‌ ప్లాంట్‌ ద్వారా రిజర్వాయర్‌ ను నీటినితో నింపే సమయంలోనే క్లోరిన్‌ గ్యాస్‌ ను తగు పాళ్ళలో కలుపుత జరుగుతునన్నారు. డిప్యూటి మేయర్‌ డైమండ్‌ బాబు మాట్లాడుతూ, మరమ్మతుకు గురయ్యిన సుద్దపల్లి డొంక యస్‌.టి.పి ని మరమ్మతు చేయకుండా, మొటార్లను ఏర్పాటు నిర్లక్ష్యం వహించినందున గత ప్రభుత్వంలో నగరంలోని 27 మంది మతికి కారనంయ్యిందన్నారు.

➡️