‘విద్యార్థి మేలుకో..భవిష్యత్తు కాపాడుకో’ పోస్టర్‌ ఆవిష్కరణ

పల్నాడు జిల్లా: విద్యార్థులకు వైసిపి ఇచ్చిన హామీల అమ లులో జరిగిన అన్యాయంపై యువత, నిరు ద్యోగులలో చైతన్యం తీసుకురావాలని టిఎన్‌ఎస్‌ ఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు కూరపాటి హను మంతరావు పిలుపు నిచ్చారు. ‘టిఎన్‌ఎస్‌ఎఫ్‌ విద్యార్థి మేలుకో భవిష్యత్‌ కాపాడుకో’ వాల్‌ పోస్ట ర్‌ను శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు ఆవిష్కరించారు. హనుమంతరావు మాటా ్లడుతూ ప్రత్యేక హోదా అంటూ విద్యార్థులను రెచ్చ గొట్టి తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారని విమ ర్శించారు. అర విందబాబు మాట్లాడుతూ విద్యార్థి లోకానికి జగన్‌ రెడ్డి చేసిన మోసాలపై అవగాహనా ర్యాలీలు, సదస్సులు, సమావేశాలు నిర్వహించి విద్యార్థులందరినీ ఏక తాటిపై తీసుకు రావాల న్నారు. విదేశీ విద్య, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ ను నిర్వీర్యం చేసి ఇటువంటి పథకాలను పట్టించు కోకపోవడంతో బీసీ,ఎ స్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు విద్యను దూరం చేశా రన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు కె. కోటిరెడ్డి, సీని యర్‌ నాయకులు కె. బ్రహ్మయ్య, నరసరావుపేట నియోజకవర్గం అధ్య క్షులు యేనుగంటి భార్గవ్‌ సాయి, జిల్లా ఉపా ధ్యక్షులు ఎం.వీరయ్య, కార్యదర్శి పఠాన్‌ అబ్దుల్‌, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షేక్‌. కరిముల్లా, నియోజకవర్గ నాయకులు బాలాజీ, సూర్య, తదితరులు పాల్గొన్నారు.

➡️