విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి

ప్రజాశక్తి-కడప అర్బన్‌ యోగి వేమన విశ్వవిద్యాలయం మహిళ హాస్టల్‌ లో బుధవారం రాత్రి విద్యార్థినిలకు ఫుడ్‌ పాయిజన్‌ అయ్యి అస్వస్థకు గురయ్యారని సంఘటన పై అధికారులు సమగ్ర విచారణ జరిగి బాధ్యులు పై చర్యలు తీసుకుని విద్యా ర్థినులకు మెరుగైన వైద్యం అందించాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్‌ తెలిపారు. శుక్రవారం యోగివేమన యూనివర్సిటీలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం రాత్రి యూనివర్సిటీ బాలికల హాస్టల్‌ లో విద్యార్థులకు భోజన సమయంలో ఫుడ్‌ పాయిజన్‌ అయ్యి వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారని పేర్కొ న్నారు. దీనిని యూనివర్సిటీ అధికారులు రహస్యంగా దాచి బయటికి తెలియకుండా విద్యార్థులను రహస్యంగా చికిత్స అందించడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. గడిచిన ఇన్ని సంవత్సరాల కాలంలో యూనివర్సిటీ హాస్టల్‌ సమస్యలపై విద్యార్థులు తరచూ ఆందోళన చేస్తున్న యూనివర్సిటీ అధికారులు పట్టించుకోకపోవడం చేతనే ఇటువంటి సంఘటనలు చోటు చేసు కుంటున్నాయని విమర్శించారు. గతంలో కూడా విద్యార్థుల భోజనంలో కూరలలో విష కీటకాలు దర్శనం ఇచ్చిన సంఘటనలు చాలా వరకు ఉన్నాయని చెప్పారు. సమావేశంలో నాయకులు సురేష్‌,రాఘవ,ప్రభు పాల్గొన్నారు. విద్యార్థుల అస్వస్థతపై చర్యలు తీసుకోవాలి .. యోగి వేమన విశ్వవిద్యాలయంలో విద్యార్థుల అస్వస్థతకు కారకులైన వారిపై విచారించి చర్యలు తీసుకోవాలని ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి వలరాజు, ఎస్‌ఎఫ్‌ఐ యూనివర్శిటీల కన్వీనర్‌ ఎం.ఆర్‌. నారకీëక్‌, ఆర్‌ఎస్‌వైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శంకర్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం వారు వైవీయూ రిజిస్ట్రార్‌ వెంకటసుబ్బయ్యను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగి వేమన యూనివర్సిటీలో తరచూ ఇలాంటి సంఘటనలు పురాతనవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇలాంటి అంశాలపై పూర్తి దష్టి సాధించాలని కోరారు. అనారోగ్య బారిన పడిన విద్యార్థుల పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సమస్యలు పునరావతమైతే విద్యార్థులతో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

➡️