విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

Mar 12,2024 20:54

ప్రజాశక్తి- శృంగవరపుకోట: పదో తరగతి పరీక్షలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాదించాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. మండలంలోని పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా సామగ్రిని మంగళవారం ఆయన పంపిణీ చేశారు. గొంప కృష్ణ విద్యా సంకల్పం అనే కార్యక్రమంలో భాగంగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలనే సదుద్దేశంతో 361 మంది పదో తరగతి పరీక్షలకు రాసేందుకుగాను ప్యాడ్లు, పెన్నులు, ఇతర స్టేషనరీ మెటీరియల్లను అందజేశారు. గొంప కృష్ణ మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించి తల్లితండ్రులకు, ఉపాధ్యాయాలుకు మంచి పేరు తీసుకురావాలన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధిక మార్కులు సాదించిన విద్యార్థులను తాను మళ్లీ కలుస్తానని అన్నారు. గణితంలో 100 మార్కులు సాధించిన విద్యార్థులకు తమకు నచ్చిన కార్పొరేట్‌ కళాశాలలో 50శాతం ఫీజు తమ వంతు సహాయం చేయనున్నట్లు తెలిపారు. ఐదు మండలాలల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యారు ్థలకు మండలంలోని మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి 50శాతం ఫీజు సహాయం చేయనున్నట్లు తెలియజేసారు. విద్యార్థుల భవిష్యత్‌కు టెన్త్‌ పరీక్షలే కీలకమని ప్రతి ఒక్కరూ కృషి, పట్టుదలతో చదవి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రాయవరపు చంద్రశేఖర్‌, జుత్తాడ రామసత్యం, ఆడారి రమేష్‌, మాదిబోయిన మంగరాజు, ఆడారి ఉమామహేశ్వరరావు, గనివాడ సన్యాసినాయుడు, శ్రీనివాస్‌రావు, పాల్గొన్నారు.కొత్తవలస: మండలంలోని అర్థన్నపాలెం, వియ్యంపేట, కొత్తవలస, కంటకపల్లి, దెందూరు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 584 మంది పదో తరగతి విద్యార్థులకు టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ పరీక్షా మెటీరియల్‌ను మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గొరపల్లి రాము, బాలకృష్ణ, జగ్గారావు, ఏడువాక రమణ, వల్లపు ఈశ్వరరావు, కంచిపాటి వేణు, తూరిబిల్లి శ్రీరాములు, పల్లి సత్యనారాయణ, బోనీ తిరుపతిరవు, పెంటరావు, సూర్యనారాయణ, కర్రి సూర్య నూకరాజు, గుమ్మడి కోటి, అప్పికొండ శ్రీనివాసరావు, గొరపల్లి అప్పలస్వామి, గంగాధర్‌, మారడిపుడి చిన్నిలు, వీర్రాజు, రామ్‌కోటి, భూసాల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️