విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి

ప్రజాశక్తి-దర్శి: విద్యార్థులు భాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. బుధవారం స్థానిక అద్దంకి రోడ్డులోని అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఆల్‌ ఇన్‌ వన్‌ స్టడీ మెటీరియల్‌ను పదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి కార్యక్రమాలను ప్రవేశపెట్టి విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు. అదే విధంగా నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు. అనంతరం అయ్యప్ప స్వామి గుడిలో స్వాముల అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, మాజీ సర్పంచ్‌ చంద్రగిరి గురవారెడ్డి, శీలం శ్రీనివాసరెడ్డి, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️