విద్యార్థులు ట్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలి : గడికోట’

ప్రజాశక్తి – రాయచోటి దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో టెక్నాలజీతో కూడిన విద్యను అందిస్తున్నారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం రాయచోటిలోని మాసాపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వ ర్యంలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యేతోపాటు కలెక్టర్‌ గిరీష పిఎస్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బైజుస్‌ వారి సహకారంతో ట్యాబ్‌ల ద్వారా విద్యను అందించడం దేశంలోనే ప్రథమం అన్నారు. ఎనిమిదవ తరగతి విద్యా ర్థులకు పాఠాలను వీడియోల ద్వారా బోధిస్తే బాగా అర్థమవుతాయని ముఖ్య మంత్రి గొప్ప ఆలోచన అన్నారు. ట్యాబ్‌లను కేవలం విద్య కోసమే ఉపయో గించుకోవాలని, ఇతర ఎటువంటి వీడియోలను చూడరాదని పిల్లలకు సూచిం చారు. కిందటి సంవత్సరం 8వ తరగతి (ప్రస్తుత 9వ తరగతి)పిల్లలకు అందిం చిన ట్యాబ్‌లు ఉపయోగకరంగా ఉన్నాయా లేదా అని విద్యార్థులను అడగగా చాలా ఉపయోగపడుతున్నాయని విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. విద్య ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని, కలెక్టర్‌, జెసిలు సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారని, వారిని ఆదర్శంగా తీసుకొని బాగా చదువుకోవాలని పిల్లలకి సూచించారు. కలెక్టర్‌ గిరీష మాట్లా డుతూ రాష్ట్ర, దేశ భవిష్యత్తు పిల్లల చదువులపై ఆధారపడి ఉంటుందని, అమెరికా, చైనా లాంటి దేశాలతో పోటీ పడాలంటే టెక్నాలజీతో కూడిన చదువు అవసరమన్నారు. తాను డిగ్రీ చదువుతూ ఉండగా కంప్యూటర్‌ను మొదటిసారిగా వాడానని, నేటితరం పిల్లలకు ఎనిమిదవ తరగతిలోనే రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం చేపడుతోందన్నారు. ట్యాబుల ద్వారా అందించే విద్యను పిల్ల లందరూ సద్వినియోగం చేసుకొని వారి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. పిల్లలు పాఠాలు చదవడం కంటే దశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ఎక్కువగా అర్థం చేసుకుంటారని పలు నివేదికలు పేర్కొన్నాయని చెప్పారు. ట్యాబ్‌ల ద్వారా పాఠాలు పిల్లలకు బాగా అర్థం అవుతాయన్నారు. అన్నమయ్య జిల్లాలో దాదాపు 16 వేల ట్యాబులను పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, విద్యాశాఖ అధికారులు, రాయచోటి మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాష పాల్గొన్నారు.

➡️