విమ్స్‌లో స్ట్రోక్‌ యూనిట్‌ ప్రారంభం

విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌

-రోగులకు రూ.50 వేలు విలువచేసే ఇంజిక్షన్‌ ఉచితం

ప్రజాశక్తి – అరిలోవ :విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో స్ట్రోక్‌ యూనిట్‌ను శుక్రవారం విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధిక ఒత్తిడితో బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన రోగులు వేగంగా కోలుకునేందుకు అత్యాధునిక సదుపాయాలు, రూ.వేల విలువచేసే ఇంజిక్షన్లు, మందులతో స్ట్రోక్‌ యూనిట్‌ను ప్రారంభించామన్నారు. న్యూరాలజీ వైద్యులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికే న్యూరో సర్జరీ సేవలు విజయవంతంగా రోగులకు పూర్తిస్థాయిలో అందిస్తున్నామన్నారు. రూ.50 వేల విలువచేసే ఇంజిక్షన్‌ ఉచితంవిమ్స్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన స్ట్రోక్‌ యూనిట్‌లో హార్ట్‌ ఎటాక్‌, బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన రోగులకు అత్యవసర సమయంలో అందించే రూ.50వేలు విలువ చేసే టేనెక్టెప్లసే ఇంజిక్షన్‌ఉచితంగా ఇస్తామన్నారు. స్ట్రోక్‌, హార్ట్‌ ఎటాక్‌ కు గురైన రోగులను మూడు, నాలుగు గంటల వ్యవధిలో తీసుకొస్తే, వారికి ఈ ఇంజిక్షన్‌ సకాలంలో అందిస్తే తక్షణమే నయమౌతుందన్నారు. అవసరమైన రోగులు ఈ యూనిట్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అతి త్వరలో మరిన్ని విభాగాలువిమ్స్‌ ఆసుపత్రిలో అతి త్వరలో అధునాతన సదుపాయాలతో గ్యాస్ట్రోఎంటరాలజీ, ఊబకాయం, బర్న్‌్‌వార్డులకు సంబంధించిన సేవలు అందుబాటులోకి తేనున్నట్లు డైరెక్టర్‌ రాంబాబు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయన్నారు.

బెయిన్‌ స్ట్రోక్‌ యూనిట్‌ ప్రారంభించారు  డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రాంబాబు

➡️