వివాహ వేడుకల్లో ‘శిద్దా’

ప్రజాశక్తి-చీమకుర్తి : ఆనంద్‌ గ్రానైట్‌ అధినేత డాక్టర్‌ పర్వతరెడ్డి ఆనంద్‌ కుమార్తె శ్రీదేవి ,క్రిస్టోస్‌ జెన్నటి వివాహ వేడుకలు చిన్నగంజాంలోని సీతారామ ఆలయంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టిడిడి బోర్డు డైరెక్టర్‌ సుధీర్‌కుమార్‌ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన వధూవరులను ఆశ్వీరదించిన వారిలో శ్రీధర్‌ ఆనంద్‌ ఆయన సతీమణి డాక్టర్‌ సుందరామణి బాలామణికుమారి, విశ్రాంత ఐఎఎస్‌ అధికారి ఆర్‌ఎం.గోనెల, విశ్రాంత డిజిపి ప్రమోద్‌ కుమారి,మైన్స్‌ డిడిఎ జగన్నాధరావు, విజిలెన్స్‌ ఏడీ ఈరేష్‌, వైసిపి చీరాల నియోజక వర్గ ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్‌, గెలాక్సీ గ్రానైట్‌ ఓనర్సు అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు చలువాది బదరినారాయణ, పెరల్‌ గ్రానైట్‌ అధినేత చలువాది నాగరాజా, జ్యూబిలీ గ్రానైట్‌ అధినేత ఎల్‌టి. నన్వానీ,జమ్‌ గ్రానైట్‌ అధినేత వీరమణి, కృష్ణసాయి గ్రానైట్‌ అధినేత శిద్దా హనుమంతరావు, వీరభద్ర గ్రానైట్‌ అధినేత ప్రతాపరెడ్డి, ఆనంద్‌ గ్రానైట్‌ మేనేజర్లు గనిమిశెట్టి కృష్ణ, కోదండపాణి, దస్తగిరి ఉన్నారు.

➡️