వైద్యుల సేవలు వెలకట్టలేనివి

Jan 30,2024 21:06

 ప్రజాశక్తి-విజయనగరం కోట  :  కోవిడ్‌ మహమ్మారి లో ప్రజలు ప్రాణాలు కాపాడి తమ ప్రాణాలు అర్పించిన వైద్యుల త్యాగాలు వెలకట్టలేనివి అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌.భాస్కర్‌ రావు తెలిపారు. కోవిడ్‌ తో మృతి చెందిన వైద్యులు దినోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ , అప్నా, గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌, పారా మెడికల్‌ సిబ్బంది ఆధ్వర్యంలో స్థానిక ఐఎంఎ హాల్‌ నుంచి సర్వజన ఆస్పత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిఎంహెచ్‌ఒ జెండా ఊపి ప్రారంభించారు. కోవిడ్‌ లో వైద్య సేవలు అందిస్తూ ప్రాణాలు కోల్పోయిన రవి కుమార్‌, భాస్కర్‌ రావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డిఎంహెచ్‌ఒ మాట్లాడుతూ కోవిడ్‌ మహమ్మారిలో ప్రజలు ప్రాణాలు కాపాడటంలో వైద్యులు పాత్ర మరువలేనిది అని తెలిపారు. ఆ సమయంలో వందల మంది వైద్యులు, సిబ్బంది ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపారు. ఏటా వారిని స్మరించుకుని నివాళులు అర్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అనంతరం ప్రముఖ వైద్యులు అశోక్‌ కుమర్‌, జె.సి.నాయుడు, వి.ఎస్‌.ప్రసాద్‌, ఎం.వెంకటేశ్వరావు, మధుకర్‌ మాట్లాడుతూ కోవిడ్‌ కాలంలో వైద్యులు చేసిన సేవలు వల్ల కొన్ని లక్షలు మంది ప్రజలు ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, శ్రీకాంత్‌, పద్మ కుమారి, హేమంత్‌ మాధవ్‌, ప్రవీణ్‌, మురళీ మోహన్‌, డాక్టర్‌ వెంకటేశ్వరరావు , నర్సింగ్‌ విద్యార్థులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

➡️