వైసిపి గూటికి సతీష్‌రెడ్డి- సిఎం సమక్షంలో చేరిక

ప్రజాశక్తి – కడప ప్రతినిధి శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ ఎస్‌.వి.సతీష్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వేంపల్లి జడ్‌పిటిసి రవికుమార్‌రెడ్డి, వైసిపి రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ రామసుబ్బారెడ్డి, కడప మేయర్‌ సురేష్‌బాబుతో కలిసి విజయవాడలోని ముఖ్యమంత్రి నివాసమైన తాడేపల్లికి చేరుకున్న అనం తరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వైసిపి కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వాని ంచారు. సతీష్‌రెడ్డి వ్యవహార శైలిపై టిడిపి అధిష్టానం అనుమానం పెంచుకుని ఏడాదిపాటు దూరంగా ఉంచి అవమానించింది. ఆయన మనస్తాపానికి గురై ఏడాది నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో ఇరుపార్టీలకు సతీష్‌రెడ్డి గుర్తుకురావడంతో రాజకీయాలకు తెరలేచింది. ముఖ్యమంత్రి జగన్‌ వ్యూహాత్మకంగా సతీష్‌రెడ్డి దగ్గరికి ఇద్దరు నాయకులను పంపించి పార్టీలోకి ఆహ్వానించడం, దీనికి పోటీగా టిడిపి ఇద్దరు సీనియర్‌ నాయకులను పంపించి ఆహ్వానించడం తెలిసిందే. పోటాపోటీ రాజకీయాల కారణంగా సతీష్‌రెడ్డి కార్యకర్తల సమావేశం నిర్వహించి కార్యకర్తల అభీష్టాన్ని తెలుసుకుని వైసిపిలో చేరినట్లు తెలుస్తోంది.

➡️