శారద స్పోర్ట్స్‌ మీట్‌లో ఎల్‌కోట విజేత

Feb 26,2024 20:55

ప్రజాశక్తి – కొత్తవలస : శారద కంపెనీ నిర్వహించిన వాలీబాల్‌ లీగ్‌ మ్యాచ్‌లో లక్కవరపుకోట జట్టు విజేతగా నిలిచింది. గత మూడు రోజులుగా శారద కంపెనీ ఆధ్వర్యంలో జరిగిన వాలీబాల్‌ టోర్నమెంట్లో ప్రథమంగా నిలిచిన ఎల్‌కోటకు సోమవారం ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, కంపెనీ సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ ప్రభాత్‌ మోహన్‌ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. ప్రథమ బహుమతిగా లక్కవరపుకోటకు రూ.1.25 లక్షలు చెక్కును రెండవ బహుమతిగా కొత్తవలసకు రూ.60 వేలు, మూడవ బహుమతిగా విజయనగరం జట్టుకు రూ.30వేలు, నాల్గవ బహుమతిగా జామికి రూ. 20వేలు చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ శారద యాజమాన్యం ఇటువంటి క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ వాలీబాల్‌ పోటీలో పాల్గొన్న 16 టీములకు బనియన్లు, రెండు బాళ్లు, నెట్‌ సర్టిఫికెట్లును అందించారు. ఈ కార్యక్రమంలో కొత్తవలస మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ మచ్చ ఎర్రయ్య రామస్వామి, కంటకాపల్లి, కాటకాపల్లి సర్పంచులు మదిన అప్పల రామ్‌, పీతల కృష్ణ, వైసీపీ నాయకులు, కంపెనీ ఏజీఎం సూర్య భాస్కర్‌, హెచ్‌. ఆర్‌. సహాయక మేనేజర్‌ శంకర్రావు, సంతోష్‌ కుమార్‌, రాష్ట్ర వాలీబాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి భగవాన్‌ దాస్‌, జిల్లా అసోసియేషన్‌ నాయకులు కృష్ణంరాజు, జాతీయ వాలీబాల్‌ కోచ్‌ గవర సూరిబాబు, ఎల్‌జిఎన్‌ కుమార్‌, పాల్తేటీ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

➡️