సంక్షేమాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తున్నాం

ప్రజాశక్తి – కడప జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సదుపాయాల సంసిద్ధతతో పాటు అభివద్ధి, సంక్షేమ పథకాలను ప్రభుత్వ లక్ష్యం మేరకు సమర్థవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్‌ వి.విజరు రామరాజు తెలిపారు. శనివారం విజయవాడ సిఎస్‌ క్యాంపు కార్యాలయం నుంచి గ్రూప్‌-2 పరీక్ష ఏర్పాట్లు, రెవెన్యూ, రీసర్వే మూడవ దశ, ఇనామ్‌, అసైన్డ్‌ భూములు, హౌస్‌ సైట్స్‌ నమోదు, హౌసింగ్‌- గహ నిర్మాణం, పిఅండ్‌ ఆర్‌డి, ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ – కరువు మండలాల్లో వేజ్‌ జనరేషన్‌, తాగునీరు, ప్రాధాన్యత భవనాలు, ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్‌ లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశానికి కడప కలెక్టరేట్‌ బోర్డు మీటింగ్‌ హాలు నుంచి జిల్లా కలెక్టర్‌ వి.విజరు రామరాజుతో పాటు జెసి గణేష్‌ కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికలను జిల్లాలో సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేశామన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాలను మరోసారి తనిఖీ చేసి ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు అన్ని వసతులను, సాధారణ భద్రతా ఏర్పాట్లు, సదుపాయాలను సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది రోజువారీ నివేధికలను అందిస్తున్నామన్నారు. ప్రయారిటీ సెక్టార్ల వారీగా జిల్లాలో జరుగుతున్న అభివద్ధి పనుల పురోగతిని జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి వివరించారు. కార్యక్రమంలో హౌసింగ్‌, డ్వామా పీడీిలు కష్ణయ్య, యదుభూషన్‌ రెడ్డి, పిఆర్‌ ఎస్‌ఇ శ్రీనివాసులు రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ వీరన్న డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ నాగరాజు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️