సంక్షేమ పాలనతో ప్రజలు హర్షం

Mar 30,2024 22:04
ఫొటో : సుందరరామిరెడ్డికి వైసిపి కండువా కప్పుతున్న విజయసాయిరెడ్డి

ఫొటో : సుందరరామిరెడ్డికి వైసిపి కండువా కప్పుతున్న విజయసాయిరెడ్డి
సంక్షేమ పాలనతో ప్రజలు హర్షం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలనతో ప్రజలంతా ఆనందంగా ఉన్నారని, రాష్ట్ర ప్రజల అభిమానం చొరగొన్న జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా వైసిపి పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్‌సి చంద్రశేఖర్‌ రెడ్డి అధ్యక్షతన ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు పార్లమెంట్‌ సమన్వయకర్త విజయసాయిరెడ్డి సమక్షంలో టిడిపికి చెందిన పలువురు నాయకులు వైసిపిలో చేరారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమంట్‌ సమన్వయకర్త విజయసాయిరెడ్డి, నెల్లూరురూరల్‌ వైసిపి అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపికి ఆకర్షితులై టిడిపితో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సాదరంగా ఆహ్వనిస్తున్నామని, జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేలా ప్రతిఒక్కరూ కష్టపడి పని చేయాలని, పార్టీలోకి వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగనన్న అందించిన సంక్షేమ సుపరిపాలనకు ప్రతిపక్ష పార్టీ నాయకులే అభిమానులుగా మారి, ఆయనవెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలనతో ప్రజలంతా ఆనందంగా ఉన్నారని, సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయడంతో ప్రజల్లోకి వెళ్లి ధైర్యంగా ఓటు అడుగుతున్నామన్నారు. నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని పార్టీ అధిష్టానం ప్రకటించినప్పటి నుండి పార్టీలో ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకుల చేరికలు రోజురోజుకు అధికమయ్యాయని తెలిపారు. రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు, మాజీ సోమశిల ప్రాజెక్ట్‌ కమిటి చైర్మన్‌ రాపూరు సుందరరామిరెడ్డి, అనంతసాగరం మండల టిడిపి అధ్యక్షులు, మాజీ మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు సడ్డా రవీంద్రారెడ్డి, నుడా మాజీ చైర్మన్‌ షేక్‌ ఖాజావళి, ఎఎస్‌పేట నుండి జునైద్‌ పాషాతో పాటు ఆత్మకూరు నియోజకవర్గం టూ వీలర్స్‌ అసోసియేషన్‌కు సంబంధించి డాక్టర్‌ ప్రణీత్‌ ఆధ్వర్యంలో 150మంది పెద్దల సమక్షంలో పార్టీలో చేరారని వివరించారు. జగనన్న సంక్షేమపాలనలో ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందిందని, ప్రతీ గ్రామంలో అభివృద్ధి వైపు పయనిస్తోందన్నారు. ఇది కొనసాగించేందుకు ప్రతిఒక్కరూ తమవెంట నడుస్తారని, 40సంవత్సరాల పార్టీలో ఉండి వారి చూడని సంక్షేమాన్ని ఐదేళ్ల జగనన్న పాలనలో చూసి పార్టీపై ఆకర్షితులై చేరుతున్నారని తెలిపారు. నెల్లూరు పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని సారధ్యంలో నెల్లూరు మరింత అభివృద్ధి పథంలో తప్పక నడుస్తుందన్నారు. అర్ధరాత్రి తాయిలాలకు ఆశపడి పార్టీలు మారుతున్న వారికి, పార్టీ చేస్తున్న సంక్షేమాన్ని చూసి పార్టీలో చేరుతున్న వారికి చాలా తేడా ఉందని, ప్రజలంతా ఇది గమనించి సంక్షేమాన్ని చేస్తున్న వారిని ఆదరించాలని కోరారు.

➡️