సమగ్ర శిక్ష ఉద్యోగుల బైక్‌ ర్యాలీ

Jan 6,2024 21:18

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సమ్మెలో భాగంగా శనివారం నగరంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌ వద్ద ధర్నా శిభిరం నుంచి ప్రారంభమైన ర్యాలీ బాలాజీ మార్కెట్‌, ఎన్‌సి ఎస్‌, గంటస్తంభం, మూడులాంతర్లు, కోట జంక్షన్‌, అంబేద్కర్‌ జంక్షన్‌, ఆర్‌టిసి కాంప్లెక్స్‌, అర్‌అండ్‌బి, పోలీస్‌ బారెక్స్‌ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆ సంఘం జెఎసి రాష్ట్ర అధ్యక్షులు బి. కాంతారావు, సిఆర్‌పి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురువులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చలో విజయవాడ కార్యక్రమాన్ని అణిచివేసే చర్యలను ఖండించారు. అరెస్టులతో ఉద్యమాన్ని, తమ గొంతును నొక్కడం సరికాదని అన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులంతా పాల్గొన్నారు.

➡️