సమస్యలు పరిష్కరించేవరకూ పోరాటం

ప్రజాశక్తి-కొండపి: అంగన్వాడీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడతాం అని కొండపి మండల అంగన్వాడీ యూనియన్‌ నాయకులు తెలిపారు. మంగళవారం కొండపి తహశీల్దారు కార్యాలయం ఎదుట 36వ రోజు అంగన్వాడీ సమ్మె కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు వినూత్న రూపంలో నిరసన తెలిపారు. రోడ్డుపైనే సంక్రాంతి ముగ్గులు వేసి తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడతాం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు, కార్య కర్తలు, ఆయాలు, సిఐటియు నాయకులు వందనం, వ్యవ సాయ కార్మిక సంఘం నాయకులు కెజి మస్తాన్‌ పాల్గొన్నారు. మద్దిపాడు: మద్దిపాడులోని దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీలు చేపట్టిన సమ్మె మంగళవారం 36వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెను సిఐటియు జిల్లా కార్యదర్శి బంకా సుబ్బారావు ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ సమ్మెను కొనసాగిస్తామని వారు తెలిపారు. శిబిరంలో అంగన్వాడీలు హాజరయ్యారు.

➡️