సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె ఆగదు

ప్రజాశక్తి – కురుపాం : స్థానిక పెట్రోలు బంకు సమీపంలో జరుగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె వద్దకు సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు జగన్మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడుగుతున్నారని, అటువంటిది వారిపై ఎందుకు అంత చిన్న చూపుని ప్రశ్నించారు. అంగన్వాడి కేంద్రాలను మహిళా పోలీసు వాలంటరీ ద్వారా తెరిపించడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతాదని అన్నారు. అనంతరం అంగన్వాడీలు వినూత్న రీతిలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం.శ్రీనివాసరావు ఎన్‌. సింహాచలం, అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు పి.సరళకుమారి, ప్రాజెక్ట్‌ కార్యదర్శి జె.సరోజ, సెక్టార్‌ లీడర్లు కె.విజయభవాని, ఎం.మీన, పలువురు అంగన్‌వాడీలు పాల్గొన్నారు.జాతీయ రహదారి పక్కన రామాథియేటర్‌ ఆవరణలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అద్వర్యాన నిర్వహించిన ధర్నా శిబిరాన్ని ఎపిటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు బి.జోగినాయుడు, గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు సీదరపు అప్పారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.గంగునాయుడు సందర్శించి మద్దతు పలికారు. తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామని సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. సమ్మెను విచ్చిన్నం చేసి అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా తెరిపించడం అన్యాయమన్నారు. వెంటనే వారి డిమాండ్లు ఆమోదించాలని కోరారు.సీతంపేట: స్థానిక ఐటిడిఎ వద్ద అంగన్‌వాడీలు తలపెట్టిన సమ్మె గురువారం కూడా కొనసాగింది. వీరి సమ్మెకు సిఐటియు మండల కార్యదర్శి కాంతారావు సంఘీభావం తెలిపారు. కార్యక్రమం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అంగన్వాడీలు అధ్యక్ష కార్యదర్శులు పార్వతి, దర్శిమీ, సహాయ అధ్యక్షులు అంజలి, పెద్దసంఖ్యలో అంగన్‌వాడీలు పాల్గొన్నారు. కొమరాడ : అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె మూడో రోజు మండల కేంద్రంలో కొనసాగింది. సమ్మెలో భాగంగా అంగన్వాడీలు చెవులో పువ్వు పెట్టి మోకాళ్లతో నిరసన తెలిపారు. ఈ సమ్మెకు టిడిపి, సిపిఐ, భవన నిర్మాణ, గిరిజన సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.సాంబమూర్తి, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు నంగిరెడ్డి మధుసూదన్‌ రావు, అరకు పార్లమెంటరీ రైతు అధ్యక్షులు దేవకోటి వెంకటి నాయుడు, జెడ్‌పి మాజీ వైస్‌ చైర్మన్‌ గుల్లిపల్లి సుదర్శనరావు, తెలుగు అరకు పార్లమెంటు రైతు ఉపాధ్యక్షులు బత్తిలి శ్రీనివాసరావు, మండల ఎస్టీ సెల్‌ కన్వీనర్‌ పాలక నూకరాజు, నాయకులు గుల్ల వెంకటనాయుడు, జిల్లా యూత్‌ అధ్యక్షులు నీరస శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు మడక నారాయణరావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు అనురాధ, మల్లీశ్వరి, పద్మ, అలివేలు, జ్యోతి, జయమ్మ, పెద్దసంఖ్యలో అంగన్‌వాడీలు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : అంగన్వాడీల సమ్మె లో భాగంగా మూడవరోజు గుమ్మలక్ష్మీపురం నుంచి ఎల్విన్‌పేట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎల్విన్‌పేట కూడలి వద్ద మోకాళ్లతో నిరసన, మానవహారం నిర్వహించారు. అంగన్వాడీ ఉద్యోగుల నినాదాలు దద్దరిల్లాయి. అనంతరం ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్‌, ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యదర్శి సత్యవతి మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం ఉదతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీల సమ్మె శిబిరానికి కురుపాం నియోజకవర్గం జనసేన సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు, డుమ్మంగి సర్పంచి పాలక క్రాంతి కుమార్‌, కుక్కిడి సర్పంచి రాజారావు, ట్రైబల్‌ రైట్స్‌ ఫోరం రోబ్బ లోవరాజు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో చెముడు గూడ ఎంపిటిసి మండంగి రమణ, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పువ్వల మోహన్‌ రావు, బిడ్డిక ఆడిత్తు, యూనియన్‌ అధ్యక్షలు వై. కస్తూరి పాల్గొన్నారు.పార్వతీపురంరూరల్‌ : కలెక్టరేట్‌ ఎదుట నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె గురువారం విజయవంతంగా కొనసాగింది. దీక్షా శిబిరానికి పలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీ నాయకులు హాజరై తమ మద్దతును తెలిపాయి. ఎపిటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లా బాలకృష్ణ మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన కోర్కెలు తీర్చు కోవడం కోసం చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బంటు దాసు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్‌కు బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గిస్తూ వేతనాలు సక్రమంగా అమలు చేయక, ఇతరత్రా అలవెన్సులు అందించడంలో జాప్యం చేస్తూ పొమ్మనలేక పొగ పెడుతున్నారని అన్నారు. జనసేన పార్వతీపురం నియోజకవర్గ కన్వీనర్‌ ఆదాడ మోహన్‌ రావు అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు డి.రమణారావు, జివి రమణ, బివి రమణ, పట్టణ పౌరసంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ప్రాజెక్ట్‌ అధ్యక్ష కార్యదర్శులు అలివేలు,గౌరీమణి పెద్ద ఎత్తున అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.పాలకొండ : స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ చేస్తున్న సమ్మెకు టిడిపి పాలకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జయకృష్ణ సంఘీభావం తెలిపారు. మాట తప్పని, మడం తిప్పని ముఖ్యమంత్రి వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు, లేకుంటే టిడిపి, జనసేన తరుపున ఉద్యమం చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల, పట్టణ టిడిపి అధ్యక్షులు ఎన్ని రామునాయుడు, గంటా సంతోష్‌, సుంకర అనిల్‌, తదితరులున్నారు. సమ్మెలో భాగంగా మోకాళ్లపై నిల్చొని అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. సమ్మెను విచ్ఛిన్నం చేసే చర్యలు ప్రభుత్వం మానుకోవాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు అమరవేణి, జెస్సీబారు, హిమప్రభ, తదితరులు ఉన్నారు.గరుగుబిల్లి : మండలంలో అంగన్‌వాడీ సమ్మె కొనసాగుతోంది. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు గౌరమ్మ, ఎం.సరస్వతి మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యలను స్పందించకపోగా నిర్బంధాన్ని ప్రయోగించడం మంచి విధానం కాదని విమర్శించారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో అంగన్వాడీ కేంద్రాలను నడిపించాలని చూడడం అవేకమైన చర్య అని అన్నారు. ఈ దీక్ష శిబిరంలో సిపిఎం నాయకులు కరణం రవీంద్ర, టిడిపి నాయకులు ద్వారపురెడ్డి సత్యనారాయణ, కంద్యాన బలరాం, జనసేన నాయకులు శ్రీనివాసరావు తదితరులు సంఘీభావం తెలిపారు.బలిజిపేట : స్థానిక బస్టాండ్‌ ప్రాంగణంలో జరుగుతున్న అంగన్వాడీల సమ్మెకు టిడిపి, జనసేన నాయకులు పెంకి వేణు గోపాల నాయుడు, బంకురు స్వామినాయుడు సంఘీభావం తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చమని కోరుతున్న అంగన్వాడీలను ఉన్నట్టుండి రోడ్డున పడేయడం సరైన పద్ధతి కాదని, సిఎంకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైనదని అన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు సాదు రాంబాబు, మాజీ ఎంపీపీ పెంకి పార్వతి, జనసేన నాయకులు వెంకటరమణ, పకీర్‌నాయుడు, హరిచరణ్‌, మార్కండేయ పాల్గొన్నారు.పాచిపెంట : అంగన్‌వాడీలు తలపెట్టిన నిరవధిక సమ్మె మండలంలో గురువారం కొనసాగింది. అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షులు టి.ప్రభావతి, సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపన్నుతూ అంగన్వాడీలను భయభ్రాంతులకు గురిచేస్తుందని విమర్శించారు. సీతానగరం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద మూడో రోజు అంగన్‌వాడీల దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా కార్యదర్శి గంట జ్యోతిలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు శైలజ, సునీత, సత్యవతి, లక్ష్మి పాల్గొన్నారు. అంగన్‌వాడీల సమ్మెకు టిడిపి, జనసేన మద్దతు తెలిపారు. సమ్మెకు శిబిరానికి పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్‌ బోనెల విజరుచంద్ర విచ్చేసి సంఘీభావం తెలిపారు. టిడిపి అధికారం వచ్చాక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు తమ పార్టీ పూర్తిగా మద్దతునిస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు తిరుపతిరావు, కొల్లి తిరుపతిరావు, ఆర్‌.వేణుగోపాలనాయుడు, పిజసత్యనారాయణ ఎస్‌.శ్రీనివాసరావు, జనసేన నాయకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.వాలంటీర్లతో కేంద్రాలు తెరిపించిన అధికారులు సాలూరు : మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో కొన్నింటిని మున్సిపల్‌ అధికారులు దగ్గర వుండి తెరిపించారు. కేంద్రాల తాళాలు పగులకొట్టి తెరిపించారు. పట్టణంలో కమిషనర్‌ జయరాం, మేనేజర్‌ రాఘవాచార్యులు, రెవిన్యూ అధికారి అహ్మద్‌ సమక్షంలో సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు కేంద్రాలను బలవంతంగా తెరిపించారు. తెరిచిన కేంద్రాలకు పిల్లలను పంపించాలని కోరినా తల్లిదండ్రులు తిరస్కరించారు. పిల్లల ఆలనాపాలనా చూసుకునే అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు విధుల్లో లేనప్పుడు వారిని ఎలా పంపిస్తామని నిలదీశారు. దీంతో అంగన్వాడీ కేంద్రాలు తెరిపించామని ప్రభుత్వానికి చెప్పుకోడానికి అధికారులు వాలంటీర్లు హడావుడి చేశారు. చినహరిజపేటలో అంగన్వాడీ కేంద్రం తెరిచినా పిల్లలను పంపించేది లేదని స్థానికులు తెగేసి చెప్పారు. డబ్బివీధిలో కేంద్రం తెరిచినా పిల్లలు కనిపించలేదు.వీరఘట్టం : అంగన్‌వాడీల సమ్మె బాట పట్టడంతో మూసివేసిన కేంద్రాలను సచివాలయ సిబ్బంది తెరిపించారు. మండలంలోని బొడ్లపాడు, మహాదేవవలస, దశమంతపురం, పనస నందివాడ , తదితర గ్రామాల్లో గ్రామ సచివాలయ కార్యదర్శులు, మహిళా పోలీసులు, వివో లు, గ్రామ వాలంటీర్లు లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు.24 అంగన్వాడీ కేంద్రాల్లో తాళాలు పగులగొట్టిన వాలంటీర్లుసీతానగరం : మండలంలోని అంగన్వాడీలు సమ్మె చేస్తున్న నేపథ్యంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎంపిడిఒ అన్ని పంచాయతీ కార్యదర్శులకు, వాలంటీర్లకు, మహిళా పోలీసులకు పిలుపునిచ్చి 24 కేంద్రాల్లో సోమవారం అంగన్వాడీ కేంద్రాలను తాళాలు పగులగొట్టారు. కాశీపేట, చినబోగిలి, లచ్చయ్యపేట, బూర్జ, సీతానగరం, కృష్ణరాయపురం, గాజులవలస చిన్నరాయుడుపేట, చిన్నంకలాంలోని అంగన్వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టినట్లు పోలీసు స్టేషన్లో యూనియన్‌ కార్యదర్శి జ్యోతిలక్ష్మి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.బొబ్బిలి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలిసీతానగరం : బొబ్బిలి ఎమ్మెల్యే అంగన్‌వాడీలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక హనుమాన్‌ జంక్షన్‌లో అంగన్‌వాడీలు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు రెడ్డి ఈశ్వరరావు మాట్లాడుతూ సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై చులకనగా మాట్లాడటం తగదని, ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని, సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ నాయకులు రెడ్డి లక్ష్మునాయుడు, జి.వెంకటరమణతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️