సమస్యలు పరిష్కారం చేయలేనప్పుడు జగన్‌కు అధికారం ఎందుకు : సిఐటియు

Dec 26,2023 15:29 #Anantapur District

ప్రజాశక్తి- తణుకురూరల్‌ (పశ్చిమగోదావరి జిల్లా ) :అంగన్వాడీ వర్కర్స్‌ చిన్నపాటి సమస్యలు పరిష్కారం చేయనప్పుడు జగన్మోహన్‌ రెడ్డికి అధికారం ఎందుకని సిఐటియు జిల్లా కార్యదర్శి పీవీ. ప్రతాప్‌ ప్రశ్నించారు. మంగళవారం అంగన్వాడీ ఆందోళన 15వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని పెద్దత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్‌ మాట్లాడుతూ.. జగన్‌ మోహన్‌ రెడ్డి ఏవరు ఆందోళన చేసిన నేను వినను, చూడను అనేవిధంగా వ్యవహారించడం బాధాకరం అన్నారు. వైసిపి ఇచ్చిన హామీలు అమలు చేయమంటే సిఎం జగన్‌కు నేరంగా ఉన్నదన్నారు. ఎంతోమంది నియంతలు ప్రజా పోరాటాలు ముందు కొట్టుకు పోయారని అన్నారు. వాలంటీర్లకు కూడా కనీస వేతనం ఇవ్వాలని అన్నారు. వాలంటీర్లు సమ్మె చేస్తే సిఐటియు సంపూర్ణ మద్దత్తు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బళ్ళ చిన వీర భద్రం, నర్సింహారావు, సిఐటియు నాయకులు గార రంగారావు, సామాజిక న్యాయ పోరాట సమితి మాజీ అధ్యక్షులు పి.మురళి కష్ణ, ఆండ్ర మాల్యాద్రి, వసంతకుమారి, జి.కనక దుర్గ, ప్రమీల,మణి మాలతి, మధు షీల, జ్యోతి,రాజకుమారి, ధనలక్ష్మి, మాదవి, జయంతి, రాధ, వరహాలు తదితరులు పాల్గొన్నారు.

➡️