సమాజాభివృద్ధిలో విలేకర్ల పాత్ర కీలకం

ప్రజాశక్తి- మెరకముడిదాం: సమాజాభివృద్ధిలో విలేకర్ల పాత్ర కీలకమని సమాజం అభి వృద్ధి పథంలో నడవాలంటే అందులో ఉన్న లోటు పాట్లను పాలకులకు తెలియ చేసి అందరికి మంచి చేకూర్చుటలో విలేకర్లు ముందుంటారని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్మించి ప్రెస్‌క్లబ్‌ను మండల నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాలకులు ఎవరైనా సరే పార్టీలతో సంబంధం లేకుండా ప్రజల సమస్యలే ఎజెండాగా చూస్తూ నిరంతరం వారి సమస్యలను ప్రజా పాలకులకు, అధికారులకు గుర్తు చేస్తూ పని చేస్తున్న ప్రెస్‌ మిత్రులందరికీ ఎపుడు మంచి చేయాలనే ఉద్దేశంతో మీకు ఎళ్ల వేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి తాడ్డి వేణుగోపాలరావు, మాజీ డిసిఎంఎస్‌ చైర్మన్‌ ఎస్‌వి రమణరాజు, వైసిపి మండల అధ్యక్షులు కోట్ల విశ్వేశ్వరరావు, బూర్లె నరేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️