సాగుచేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి

Mar 3,2024 21:22

ప్రజాశక్తి – కొమరాడ : గిరిజనులు సాగు చేస్తున్న పోడు, అన్యాక్రాంతమైన భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజన సంఘం నాయకులు రాము డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఈనెల5న కలెక్టరేట్‌ వద్ద తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ గుమడ సంతలో ప్రచారం, ర్యాలీ ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు రాము, మంగులు, లక్ష్ము, సిఐటియు జిల్లా కమిటీ నాయకులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ జిల్లాలో తరతరాలుగా పేదలు, గిరిజనులు సాగు చేస్తున్న ప్రభుత్వ బంజర భూములకు డి పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అన్యాక్రాంతమైన పేదల పట్టా భూములు తిరిగి వారికి ఇవ్వాలని, కొండపోడు సాగు చేస్తున్న గిరిజనులకు ప్రతి కుటుంబానికి పది ఎకరాల వరకు పోడు పట్టాలి ఇవ్వాలని కోరారు. వీటితో పాటు ఉపాధి హామీ కింద 200 రోజులు పని దినాలు, రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలని, తదితర సమస్యలపై ఈనెల 5న ఇవ్వాలని ఈ సమస్యల పైన మార్చి 5వ తేదీ అనగా మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా ఉంది కాబట్టి దళితులు గిరిజనులు వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశు, రామారావు, బలరాం సుబ్బారావు, మంగులు, పోలినాయుడు వెంకటేష్‌ పాల్గొన్నారు.

➡️