సిఎం సహాయ నిధి చెక్కు అందజేత

Feb 12,2024 21:05

 ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ : బలిజిపేట మండలం, వెంగాపురానికి చెందిన మరడాన యళ్ళంనాయుడు, రేష్మ దంపతుల కుమారుడుకి అనారోగ్య కారణంగా వైద్యం చేయించి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సంగతి తెలుసుకొని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు సిఎం సహాయనిధికి సిఫార్సు చేయగా, వారి కుటుంబానికి మంజూరైన రూ.70వేలు విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు గులిపిల్లి మురళీ తదితరులు పాల్గొన్నారు.గిరిజనులకు పట్టాలు అందజేతమండలంలోని అడారు గిరిజన గ్రామానికి చెందిన గిరిజన కుటుంబాలు గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూమిపై రైతులకు హక్కును కల్పిస్తూ రెవిన్యూ శాఖ మంజూరు చేసిన వ్యవసాయ భూమి మంజూరు పత్రాలను సోమవారం ఎమ్మెల్యే జోగారావు గిరిజనులకు అందజేశారు.వైసిపిలోకి చేరిన టిడిపి కార్యకర్తలుమండలంలోని జమదాలకు చెందిన టిడిపి కార్యకర్తలు, మూడో వార్డు సభ్యులు జాగాన పారి నాయుడు, మాచెర్ల కుమారస్వామి, మరిపి అప్పల నాయుడు, బొంగు నరహరి, కార్యకర్తలతో గ్రామ యువత పెద్ద ఎత్తున సోమవారం ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైసిపి చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువా వేశారు. కార్యక్రమంలో మండల వైసిపి అధ్యక్షులు బొమ్మి రమేష్‌, జిల్లా ఉపాధ్యక్షులు భీమవరపు కృష్ణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి వి.గురురాజు, సర్పంచ్‌ యాళ్ళ ఈశ్వర ప్రతాప్‌, జెఎఎస్‌ కన్వీనర్‌ బంకపల్లి వాసుదేవరావు, వైసిపి నాయకులు భూపతి శేఖర్‌, యాళ్ల శ్రీను, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️