సిపిఎం సంతకాల సేకరణ

Feb 25,2024 20:25

 ప్రజాశక్తి – కొత్తవలస : స్థానిక రైల్వే అండర్‌ బ్రిడ్జి పై నడక వంతెన, అండర్‌ బ్రిడ్జి లోపల ఫుట్పాత్‌ ఏర్పాటు చేయాలని సిపిఎం నాయకులు గాడి అప్పారావు ఆదివారం సంతకాలు సేకరణ చేపట్టారు. రైల్వే అండర్‌ బ్రిడ్జి లోపల వాహనాచోధకులు, పాదచారులచే సంతకాలు సేకరణ చేపట్టారు. కొత్తవలస రైల్వే స్టేషన్‌ సందర్శనకు విచ్చేస్తున్న రైల్వే జీఎం, రైల్వే డిఆర్‌ఎమ్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు సంతకాలు సేకరణ చేపట్టినట్టు అప్పారావు తెలిపారు. రైల్వే అండర్‌ బ్రిడ్జి గుండా వెళుతున్న వాహన చోదకులు ప్రతి రోజు ఇబ్బందులు పాలవుతున్నారని, ఈ సమస్యను గుర్తించి రైల్వే ఉన్నతాధికారులు తగిన చొరవ చూపాలని కోరారు. రైల్వే అధికారులు చొరవ చూపి తమ విన్నపాన్ని మన్నించి, ఫుట్పాత్‌ ఏర్పాటు చేస్తారని కోరారు.

➡️