‘సివి.రామన్‌’లో క్రీడా పోటీలు ప్రారంభం

సివిరామన్‌ పాఠశాల్లో జ్యోతి వెలిగించి క్రీడా పోటీలు ప్రారంభిస్తున్న వేణుగోపాలరావు తదితరులు

ప్రజాశక్తి-అమలాపురం

అమలాపురం సర్‌ సివి.రామన్‌ స్కూల్లో ఆ స్కూల్‌ డైరెక్టర్‌ ఆర్‌.వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ఆటలపోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి .ఈ పోటీలను అమలాపురం మున్సిపల్‌ కమిషనర్‌ అయ్యప్ప నాయుడు, అమలాపురం మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ నాని రాజు, కౌన్సిలర్‌ దొంగ నాగ సుధారాణి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలు ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ క్రీడలు శనివారం కూడా జరగనున్నాయని పోటీల్లో గెలుపొందిన వారికి మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేస్తామని పాఠశాల డైరెక్టర్‌ రవణం వేణు గోపాలరావు తెలిపారు. కార్యక్రమంలో అంబాజీపేట మాజీ జెడ్‌పిటిసి సభ్యుడు, ప్రస్తుత ఖోఖో ఫెడ్‌ చైర్మన్‌ అరిగెల బలరాంమూర్తి, స్కూల్‌ డైరెక్టర్‌ ఆర్‌.వేణుగోపాలరావు, సహస్ర ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.ఘనంగా రాంబాబు జయంతితొలుత సర్‌ సివి రామన్‌ వ్యవస్థాపకులు దివంగత రవణం రాంబాబు జయంతిని సర్‌ సివి.రామన్‌ స్కూల్‌ నందు శుక్రవారం ఘనంగా నిర్వహించారు పట్టణానికి చెందిన పిల్లి వందన మలేషియాలో జరిగిన అంతర్జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సందర్భంగా సన్మానించారు. వందన కుటుంబ సభ్యులకు పాఠశాల తరఫున ఏ సహాయం కావలసిన అందిస్తానని పాఠశాల డైరెక్టర్‌ రవణం వేణుగోపాలరావు హామీ ఇచ్చారు. రాంబాబు చిత్రపటానికి విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు సిబ్బంది పూలమాలలు వేసి. నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌. కె.పెద్దిరాజు, సహస్ర ప్రిన్సిపల్‌ గౌసియా బేగం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

➡️