సూర్యలక్ష్మికి కళా మిత్ర పురస్కారం

Dec 1,2023 20:27

ప్రజాశక్తి-విజయనగరం కోట  :   కళా, సామాజిక సేవ, నాటక రంగంలో చేస్తున్న సేవలకు గాను నగరానికి చెందిన భోగరాజు సూర్యలక్ష్మికి కళా మిత్రమండలి రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారం అభించింది. కళా మిత్రమండలి తెలుగు లోగిలి ఒంగోలు 17వ వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా ఎన్టీఆర్‌ కళాక్షేత్రం ఈ పురస్కారాన్ని అందజేశారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జివి పూర్ణచంద్‌, కళా మిత్రమండలి డాక్టర్‌ నూనె అంకమ్మ రావు, చైర్మన్‌ తేళ్ల అరుణ, ప్రధాన కార్యదర్శి సింహాద్రి జ్యోతిర్మయి, ప్రముఖ సినీ గేయ రచయిత భువనచందర్‌ చేతుల మీదుగా పురస్కార ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సూర్యలక్ష్మి మాట్లాడుతూ కళా, సాహిత్య, నాటక రంగానికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఆమెకు పురస్కారం రావడం పట్ల జిల్లా కళాకారులు, సాహితీవేత్తలు, సామాజిక సేవకులు అభినందనలు తెలిపారు.

➡️