స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి : ఎస్‌పి

ప్రజాశక్తి-సుండుపల్లె ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియో గించుకోవాలని ఎస్‌పి బి.కృష్ణారావు అన్నారు. శుక్రవారం రాత్రి సుండుపల్లి, రాయవరం, తిమ్మసముద్రం గ్రామాల ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు నిర్భయంగా, భయపక్షపాతాలు లేకుండా ఉండేందుకు పోలీసులు అనునిత్యం అండగా ఉంటా రని పేర్కొన్నారు. ప్రజలు ఎటువంటి అపోహలకు గురికావద్దని తెలిపారు. ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వారిదేనని చెప్పారు. నిర్భయంగా ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియో గించుకోవాలన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డిఎస్‌పి మహబూబ్‌ బాషా, రాయచోటి రూరల్‌ సిఐ తులసిరామ్‌, టి.సుండుపల్లి ఎస్‌ఐ పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️