హెచ్‌ఐవి బాధితులతో సహపంక్తి భోజనం

Dec 1,2023 20:16

  ప్రజాశక్తి-విజయనగరం కోట :  హెచ్‌ఐవి బాధితులు, ట్రాన్స్‌ జెండర్ల పట్ల సమాజంలో వివక్షత పోగొట్టి సమాజంలో ఇతరులతో కలసి జీవించేందుకు అనువైన పరిస్థితులు ఏర్పరచే లక్ష్యంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని లెట్‌ కమ్యూనిటీస్‌ లీడ్‌ అనే నినాదంతో ఈ ఏడాది నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లాలోని హెచ్‌ఐవి బాధితులు, ట్రాన్స్‌జెండర్లతో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. డిఎంహెచ్‌ఒ ఎస్‌.భాస్కరరావు, జిల్లా క్షయ, కుష్టు, ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి డాక్టర్‌ కె.రాణి, జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి డి.రమేష్‌ తదితరులు పాల్గొని వారితో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్‌ఒ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సమాజంలో వారూ ఒక భాగమే, వారికి సమాజం తోడ్పాటు వుంటుందని చెప్పేందుకే ఈ ప్రయత్నం చేశామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఎన్‌.సూర్యనారాయణ, ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ ఆర్‌.అచ్యుత కుమారి, పొజిటివ్‌ నెట్‌వర్క్‌ సంస్థ ప్రతినిధి పద్మ, ట్రాన్స్‌జెండర్ల సంఘం అధ్యక్షురాలు మీనాకుమారి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

➡️