10న చంద్రబాబు బహిరంగ సభ

Jan 6,2024 21:19

ప్రజాశక్తి-బొబ్బిలి  :  టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఈనెల 10న బొబ్బిలి రానున్నారు. రాజా కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో భాగంగా ఈ సభ జరుగనుంది. ఈమేరకు కోటలో టిడిపి ముఖ్యనేతలంతా శనివారం సమావేశం నిర్వహించారు. అనంతరం బహిరంగ సభ జరగనున్న రాజా కళాశాల మైదానాన్ని మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు, కిమిడి కళా వెంకటరావు, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు కిమిడి నాగార్జున, మాజీ ఎమ్మెల్యే తెంటు రాజా, నియోజకవర్గ ఇంఛార్జి బేబినాయన, ఇతర నాయకులు పరిశీలించారు. బహిరంగ సభను జయప్రదం చేయాలని ప్రజలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

➡️