యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం : యోగా గురువు ఆకుల ఖేతన్

Jun 20,2024 17:48 #Konaseema, #yoga

ప్రజాశక్తి -మామిడికుదురు : యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని యోగా గురువు ఆకుల ఖేతన్ అన్నారు. మామిడికుదురు లోని ఖేతన్ యోగా సెంటర్ ఆద్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. మామిడికుదురు నుండి నగరం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. నిత్యం యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, ఒత్తిడి దూరం చేస్తుందని దీర్ఘ కాలిక రోగాల నుండి ఉపశమనం పొందవచ్చని ఖేతన్ అన్నారు. యోగా ద్వారా బిపి షుగర్ నియంత్రణలో ఉంటుందని అంతేకాకుండా వివిధ రకాల వ్యాధులు యోగా చేయడం వల్ల దూరం అవుతాయని ,యోగా వల్ల కలిగే లాభాలు పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కోట బ్రహ్మానందం, మెండా ఆదినారాయణ,కడలి నూకరాజు,నయినాల రఘు రామయ్య, నయినాల సత్య దుర్గా ప్రసాద్, బత్తుల శ్రీదేవి, అరుణ, లీల, నానాజీ, కంచి నాగరాజు, గెద్దాడ ప్రసాద్, బత్తుల శ్రీనివాస్, హేమ, సీ హెచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 

➡️