అచ్చుతాపురంలో పిచ్చికుక్క స్వైర విహారం.. 10మందికి గాయాలు

Mar 18,2024 17:56 #Dog Bite, #East Godavari

ప్రజాశక్తి-గోకవరం : మండలంలోని అచ్చుతాపురం గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. సోమవారం అచ్యుతాపురం గ్రామంలో పిచ్చికుక్క కరిచి 10మందికి గాయాలు అయ్యి గోకవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలియ వచ్చింది. ఈ సందర్భంగా గ్రామస్తులు విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో పిచ్చి కుక్కల వల్ల ప్రజలపై దాడులు జరిగి తీవ్ర గాయాల పాలవుతున్నారని, తక్షణమే కుక్కల నియంత్రణకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

➡️