104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Dec 10,2023 21:09

 ప్రజాశక్తి-పార్వతీపురం :   104 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి వై.మన్మథరావు, 104 ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యదర్శి సిహెచ్‌.ప్రసాద్‌ ప్రభు త్వాన్ని డిమాండ్‌చేశారు. యూని యన్‌ జిల్లా అధ్యక్షులు డి.ఆనంద రావు అధ్యక్షతన స్థానిక సుందరయ్య భవనంలో ఆదివారం సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 104 ఉద్యోగు లకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. 104 వాహన సేవలు గతంలో మాదిరి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని డిమాండ్‌చేశారు. జిఒ 4459 ప్రకారం పిఎఫ్‌, ఇఎస్‌ఐ సక్రమంగా అమలు చేయాలన్నారు. యాజమాన్యం చెల్లించాల్సిన ఎంప్లాయిర్‌ కంట్రిబ్యూషన్‌ అరబిందో యాజమాన్యమే ఇవ్వాలని కోరారు. 104లో పనిచేస్తున్న డిఇఒలకు వెయిటేజ్‌ మార్కులు కల్పించి ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్‌చేశారు. అక్రమ బదిలీలు, తొలగింపులు చేసిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో 104 ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️