Nov 27,2023 19:30
పత్రం అందజేస్తున్న దృశ్యం

పత్రం అందజేస్తున్న దృశ్యం
సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పావని
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:
సర్పంచుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మండలంలోని విలుకానిపల్లి సర్పంచ్‌ గోపిరెడ్డి పావని ఎంపికయ్యారు. రాష్ట్ర కార్యదర్శిగా గోపిరెడ్డి పావనిని ఎంపిక చేయడం పట్ల టీడీపీ సర్పంచ్‌ (ఇస్కపాలెం) ఇంగిలాల వెంకట చైతన్య కుమార్‌ సోమవారం హర్షం వ్య క్తం చేశారు. తిరుపతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ పం చాయతీ రాజ్‌ ఛాంబర్‌, ఏపీ సర్పంచ్‌ల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నటు తెలి పారు. ఏపీ పంచాయతీ రాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షులు వైవిబి రాజేంద్ర ప్రసాద్‌ పావనికి నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదే శ్‌ సర్పంచుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి దేవారెడ్డి నాగేంద్ర ప్రసాద్‌ రెడ్డి, కార్యదర్శి టికె శ్రీనివాసన్‌, ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కందమూడి శివకుమార్‌, ఉపాధ్యక్షులు చిట్టెటి కవిత, చాంబర్‌ నాయకు లు గోపిరెడ్డి, వెంకటేష్‌ యాదవ్‌, మునీష్‌, సర్పం చుల సంఘం ఛాంబర్‌ నాయకులు పాల్గొన్నారు.

➡️